హైదరాబాద్ లో BLive మూడో ఎక్స్ పీరియన్స్ స్టోర్ ప్రారంభం
భారత్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాట్ ఫామ్ BLive. ఈ సంస్థ తన మూడో EV ఎక్స్ పీరియన్స్ స్టోర్ ను రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించింది. బాపూనగర్ లో దీన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ప్రగతినగర్, హఫీజ్ పేట్ లో ఇప్పటికే BLive ఎక్స్ పీరియన్స్ స్టోర్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో 100కి పైగా స్టోర్స్ ఏర్పాటు చేయాలన్నది BLive లక్ష్యం. దీనిలో భాగంగానే రానున్న మూడేళ్లలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో కనీసం 15 మల్టీ-బ్రాండ్ స్టోర్స్ అందుబాటులోకి తెచ్చేందుకు BLive సన్నాహాలు చేస్తోంది. BLive EV ఎక్స్ పీరియన్స్ స్టోర్ పలు రకాల ఉత్పత్తులను అందిస్తోంది. BLive కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ లో ఇన్ హౌస్ క్విక్ సర్వీస్ కియోస్క్, బ్యాటరీ స్వాపింగ్, EV ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. Tags: battery swap facilities, BattRE, BLive, e-bikes, E-Motorad, electric bicycles, electric two wheelers, ev, EV charging infrastructure, EV...