ఘ‌నంగా AR Rahman కుమార్తె వివాహం





ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు గ్ర‌హీత AR Rahman కుమార్తె ఖతీజా రెహజాన్‌

 వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఆడియో ఇంజ‌నీర్ రియాస్దీన్ షేక్ మహమ్మద్ ను ఆమె పెళ్లి

 చేసుకున్నారు. ఖ‌తీజా ప్రింటెడ్ ఆఫ్ వైట్ డ్రెస్ లో త‌ళుక్కుమ‌న‌గా ... రియాస్దీన్ తెలుపు రంగు

 షేర్వానీలో ధ‌గ‌ధ‌గ‌లాడారు. వారి మ్యారేజ్ ఫొటోను ఏఆర్ రెహ‌మాన్ త‌న సోష‌ల్ మీడియా

 అకౌంట్ల‌లో పోస్ట్ చేశారు. భ‌గ‌వంతుడు ఈ కొత్త జంట‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుతూ పెళ్లి ఫొటోను

 అభిమానుల‌తో పంచుకున్నారు. అందులో ఖతీజా-రియాస్దీన్  తో పాటు రెహ‌మాన్, ఆయ‌న భార్య

 సైరా భాను... వారి మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు ర‌హీమా & అమీన్ కూడా ఉన్నారు. రెహ‌మాన్ త‌ల్లి ఫొటో

 కూడా అందులో ఉంది. మ‌రోవైపు, ఇది త‌న జీవితంలో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజని

 ఖతీజా పోస్ట్ చేశారు. మ‌న‌సుకు ఇష్ట‌మైన వ్య‌క్తిని సొంతం చేసుకున్నాన‌ని తెలిపారు. అటు,

 ఖతీజా-రియాస్దీన్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లువురు సినీరంగ

ప్ర‌ముఖులు వారికి విషెస్ చెప్పారు. వారంద‌రికీ ఏఆర్ ర‌హ‌మాన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Google on Slice App

Yadadri Temple History || యాదగిరి గుట్ట || Yadagirigutta

iPhone 14 series